మాంట్రియల్/టొరంటో: యుఎస్ ఓపెన్ సన్నాహకమైన నేషనల్ బ్యాంక్ ఓపెన్ టోర్నీలో స్పెయిన్‌కు చెందిన పాబ్లొ కరెనోబుస్టా విజేతగా నిలవగా, కెనడియన్ ఓపెన్ టోర్నీలో రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ బుస్టా 3-6, 6-3, 6-3తో పోలండ్‌కు చెందిన 14వ సీడ్ హ్యూబర్ట్ హర్కజ్ను ఓడించాడు. ఈ విజయంతో యుఎస్ ఓపెన్‌లో బుస్టా ర్యాంకింగ్ 23నుంచి 14కు పెరగనున్నది. బుస్టా కెరీర్లో ఇదే అతి పెద్ద విజయం. మహిళలకు టొరంటోలో నిర్వహించిన కెనడియన్ ఓపెన్ టోర్నీలో హలెప్ 6-3, 2-6, 6-3తో బ్రెజిల్ యువ క్రీడాకారిణి బీట్రిజ్ హదద్ మయాపై విజయం సాధించి ఇక్కడ మూడోసారి, కెరీర్లో తొమ్మిదో డబ్ల్యుటీఏ-1000 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో హలెప్ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకోనున్నది.