శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 22:29:17

సిక్కిరెడ్డికి మ‌రోసారి క‌రోనా టెస్ట్‌

 సిక్కిరెడ్డికి మ‌రోసారి క‌రోనా టెస్ట్‌

హైదరాబాద్‌:  భార‌త డ‌బుల్స్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ఎన్‌.సిక్కిరెడ్డికి మ‌రోసారి కొవిడ్‌-19 ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆమెతో పాటు ఫిజియో కిర‌ణ్‌కు శుక్ర‌వారం న‌గ‌రంలో కాంటినెంట‌ల్ ద‌వాఖానాలో క‌రోనా వైర‌స్ ప‌రీక్ష నిర్వ‌హించారు. సుదీర్ఘ విరామం అనంత‌రం ఈ నెల 7 నుంచి గోపీచంద్ అకాడ‌మీలో ప్రారంభ‌మైన జాతీయ బ్యాడ్మింట‌న్ శిబిరంలో పాల్గొన్న సిక్కిరెడ్డికి గురువారం కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమెతో పాటు ఆమె భ‌ర్త, భార‌త డ‌బుల్స్ ప్లేయ‌ర్ సుమీత్ రెడ్డి శుక్ర‌వారం మ‌రోసారి పరీక్ష నిర్వ‌హించుకున్న‌ట్లు స‌మాచారం. 

క్యాంప్‌లో ఉన్న 21 మందిలో ఇద్ద‌రికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ప్ర‌స్తుతానికి శిబిరాన్ని నిలిపివేస్తున్న‌ట్లు సాయ్ అధికారులు గురువారమే పేర్కొన‌గా.. తాజా టెస్టుల్లోనూ సిక్కిరెడ్డికి పాజిటివ్‌గా తేలితే.. మిగిలిన ఆట‌గాళ్లు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని యోచిస్తున్నారు. అందులో హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ పీవీ సింధు, కిడాంబి శ్రీ‌కాంత్‌, సాయి ప్ర‌ణీత్ త‌దిత‌రులు ఉన్నారు.


logo