మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 20:31:49

ENGvWI: నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్‌

ENGvWI:  నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్‌

సౌతాంప్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌  నిలకడగా ఆడుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ప్రత్యర్థి బౌలర్లను  ధాటిగా ఎదుర్కొంటున్నది. డొమినిక్‌ సిబ్లే(50: 164 బంతుల్లో 4ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో స్కోరు బోర్డులో కదలిక  వచ్చింది.   సెకండ్‌ ఇన్నింగ్స్‌లో   69 ఓవర్లు ముగిసేసరికి    ఇంగ్లాండ్‌ 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.  జాక్‌ క్రాలీ(35), బెన్‌స్టోక్స్‌(0) క్రీజులో  ఉన్నారు.  ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు 51   పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్‌ కొనసాగుతోంది.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్‌ చేసి మ్యాచ్‌పై మరింత పట్టుబిగించాలని విండీస్‌ భావిస్తున్నది. టెస్టులో కరీబియన్‌  బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా కట్టడి   చేస్తున్నారు. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ బలంగా పుంజుకొని పరుగులు సాధిస్తేనే గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. 


logo