సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 00:38:34

సాత్విక్‌కు కరోనా

సాత్విక్‌కు కరోనా

హైదరాబాద్‌: భారత స్టార్‌ డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డికి కరోనా సోకింది. తన డబుల్స్‌ భాగస్వామి చిరాగ్‌ శెట్టితో కలిసి సాత్విక్‌ అర్జున అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. జాతీయ క్రీడాదినోత్సవం(ఆగస్టు 29) రోజున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అవార్డుల ప్రదాన  కార్యక్రమానికి హాజరవుదామనుకున్న సాత్విక్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. గురువారం తిరిగి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా సాయిరాజ్‌కు పాజిటివ్‌ రాగా, కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చిం ది. దీంతో జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమానికి సాత్విక్‌ దూరమవనున్నాడు. 


logo