గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 03, 2020 , 22:18:10

DC vs KKR:పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన కోల్‌కతా

DC vs KKR:పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన కోల్‌కతా

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన  229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. నోర్ట్జే వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ బౌల్డ్‌ అయ్యాడు.  వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రాణా, ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ దూకుడుగా ఆడుతున్నారు.  ఫోర్లు, సిక్సర్లే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి  కోల్‌కతా 59/1తో నిలిచింది.

కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్‌కతా పవర్‌ హిట్టింగే చేయాల్సి ఉంది.  8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 72 పరుగులు చేసింది.  శుభ్‌మన్‌ గిల్‌(28), నితీశ్‌(34) క్రీజులో ఉన్నారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ఈ జోడీ భావిస్తోంది.