గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 02:36:16

గిల్‌ సెంచరీ

గిల్‌ సెంచరీ

లింక్లిన్‌ (న్యూజిలాండ్‌): యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (107 బ్యాటింగ్‌; 13 ఫోర్లు, ఓ సిక్స్‌) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌-ఏ దీటుగా బదులిస్తున్నది. మూడో రోజైన ఆదివారం 53 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన భారత్‌-ఏ.. కెప్టెన్‌ విహారి (59) వికెట్‌ కోల్పోయి 234 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్‌.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు  156 పరుగులు వెనుకబడి ఉంది. గిల్‌తో పాటు చతేశ్వర్‌ పుజారా (52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌ 390/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. డారిల్‌ మిషెల్‌ (103 నాటౌట్‌) శతకంతో ఆకట్టుకున్నాడు.


logo
>>>>>>