శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 03:19:41

గిల్‌ అజేయ ద్విశతకం

గిల్‌ అజేయ ద్విశతకం

క్రైస్ట్‌చర్చ్‌: భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (204 నాటౌట్‌) అజేయ ద్విశతకంతో మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ హనుమ విహారి (100 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించడంతో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన తొలి అనధికార టెస్టును భారత్‌-ఏ డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 127/2 తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. ఆటముగిసే సమయానికి 448/3తో నిలిచింది. ప్రియాంక్‌ (115) శతకం తర్వాత ఔటైనా.. గిల్‌, విహారి అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 222 పరుగులు జోడించారు.  logo