మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 12, 2020 , 10:43:50

శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ..

శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ..

హైద‌రాబాద్‌: సిడ్నీలో ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో.. రెండ‌వ రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మెన్ శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. తాజా స‌మాచారం అందేవ‌ర‌కు భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 97 ర‌న్స్ చేసింది.  ఇండియా జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 194 ర‌న్స్ చేసి ఆలౌటైన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా ఏ జ‌ట్టు త‌న తొలి ఇన్నింగ్స్‌లో 108 ర‌న్స్ చేసింది. ప్ర‌స్తుతం ఇండియా 183 ర‌న్స్ లీడ్‌లో ఉన్న‌ది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా మూడు ప‌రుగుల‌కే ఔట‌య్యాడు.  ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 32 ర‌న్స్‌తో, గిల్ 57 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.