మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 16:50:15

గిల్‌‌, సారా టెండూల్కర్ మధ్య సంథింగ్‌.. సంథింగ్‌?

గిల్‌‌, సారా టెండూల్కర్ మధ్య సంథింగ్‌.. సంథింగ్‌?

ముంబై:  సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలు ఎప్పటికప్పుడూ లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటారు. కొన్నిసార్లు ఫన్నీ కామెంట్లు కూడా పెడుతుంటారు.  తక్కువ వయసులోనే   మంచి ప్రదర్శన ద్వారా అనతికాలంలోనే  మంచి  ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌.  ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కరోనా వల్ల  ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్న గిల్‌ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. తాజాగా అతడు పెట్టిన క్యాప్షన్‌పై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు

టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌, యువ ఆటగాడు శుభ్‌మన్‌  చాలా  రోజులుగా ఒకరినొకరు సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతున్నారు. చాలా చురుగ్గా ఉండే  వీరిద్దరూ  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు, క్యాప్షన్‌ నెటిజన్లను ఆలోచనలో పడేశాయి. తాజాగా దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఐ స్పై అంటూ ఆలోచన రేకెత్తించే క్యాప్షన్‌ను జోడించారు. ఇద్దరూ ఒకే క్యాప్షన్‌ పెట్టడంపై నెటిజన్లు తమదైన శైలిలోకామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య సంథింగ్‌..సంథింగ్‌ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఐతే ముందుగా సారా పెట్టిన క్యాప్షన్‌ను గిల్‌ కాపీ చేసి పోస్ట్‌ చేయడంతో కేకేఆర్‌ ఓపెనర్‌ను ఆటపట్టిస్తున్నారు. 

View this post on Instagram

I spy ????

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

View this post on Instagram

I spy ????

A post shared by Ꮪhubman Gill (@shubmangill) on


logo