మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 29, 2020 , 20:05:11

CSK vs KKR: కోల్‌కతా ఆరంభం అదిరింది

CSK vs KKR: కోల్‌కతా ఆరంభం అదిరింది

దుబాయ్:‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలకడగా ఆడుతోంది.  దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్లో శుభ్‌మన్‌ గిల్‌ రెండు ఫోర్లు బాదగా నితీశ్ రాణా ఒక ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి.  ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో చెన్నై కట్టుదిట్టంగా బంతులేయడంతో పెద్దగా పరుగులేమీ రాలేదు. 

సాంట్నర్‌ వేసిన ఆరో ఓవర్లో రాణా రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 48/0తో నిలిచింది.  ఓపెనర్లిద్దరూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నారు.  7 ఓవర్లకు కోల్‌కతా వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రాణా(26), గిల్‌(26) దూకుడుగా ఆడేందుకు  ప్రయత్నిస్తున్నారు.