సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 07:27:09

శుభ్‌మ‌న్ గిల్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 70/1

శుభ్‌మ‌న్ గిల్ అర్ధ సెంచ‌రీ.. భార‌త్  70/1

బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియా-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ భార‌త్ ముందు 328 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచిన విష‌యం విదిత‌మే. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు కేవ‌లం రెండే ఓవ‌ర్లు ఆడింది. ఇక మంగ‌ళ‌వారం ఆట ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికి రోహిత్ శ‌ర్మ (7) క‌మ్మిన్స్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక ఈ సిరీస్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రుస్తున్న శుభ్‌మ‌న్ గిల్ కెరీర్‌లో రెండో అర్ధ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. 104 బంతుల్లో 5 ఫోర్స్ సాయంతో 55 ప‌రుగులు చేశాడు. ఇక క్రీజులో గిల్‌తో పాటు పుజారా(8) ఉన్నారు. ఈ రోజు భార‌త్ 66 ఓవ‌ర్స్ ఆడాల్సి ఉండ‌గా, నిర్ణీత ఓవ‌ర్స్‌లో ల‌క్ష్యాన్ని చేదిస్తారా, లేక మ్యాచ్ ను డ్రాగా ముగిస్తారా అన్న‌ది చూడాలి. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 294 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇక భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 336 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి 70 ప‌రుగులు చేసింది. 

VIDEOS

logo