శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 26, 2020 , 22:47:11

గిల్‌ అర్ధశతకం..విజయం దిశగా కోల్‌కతా

గిల్‌ అర్ధశతకం..విజయం దిశగా కోల్‌కతా

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్‌లో అతనికిది ఐదో హాఫ్‌సెంచరీ. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. మరో ఎండ్‌లో వికెట్లు పోతున్నా సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.   స్వల్ప లక్ష్యం కావడంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ నిలకడగా ఆడుతున్నారు. 

ప్రస్తుతం గిల్‌(53), ఇయాన్‌ మోర్గాన్‌(17) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు కోల్‌కతా 3 వికెట్లకు 102 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా  విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ జట్టు విజయానికి ఇంకా 36 బంతుల్లో 41 రన్స్‌ చేయాల్సి ఉంది.