శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 20:35:43

దంచికొడుతున్న పంత్‌, అయ్యర్‌

దంచికొడుతున్న  పంత్‌, అయ్యర్‌

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడుగా ఆడుతోంది. 22/3తో కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు.   టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ చేరినా  ఇన్నింగ్స్‌ను వెంటనే చక్కదిద్దారు.  కృనాల్‌ పాండ్య వేసిన 10వ ఓవర్లో పంత్‌ రెండు భారీ సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టాడు.

అయ్యర్‌, పంత్‌  స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ  70కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 13 ఓవర్లకు ఢిల్లీ 3 వికెట్లకు 93 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌(42), అయ్యర్‌(39) క్రీజులో ఉన్నారు. ఈ జోడీని విడదీసేందుకు ముంబై బౌలర్లు శ్రమిస్తున్నారు.