బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 10:01:35

శ్రేయస్‌ తొలి శతకం..రాహుల్‌ అర్ధశతకం

శ్రేయస్‌ తొలి  శతకం..రాహుల్‌ అర్ధశతకం

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు.

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అద్వితీయ  ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అయ్యర్‌(103: 107 బంతుల్లో 11ఫోర్లు, సిక్స్‌) శతకంతో మెరిశాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఆతిథ్య బౌలర్ల ధాటిగా బంతులేస్తున్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. నంబర్‌ 4లో సరైన ఆటగాడినని అయ్యర్‌ మరోసారి నిరూపించుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో సౌథీ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

విరాట్‌ కోహ్లీతో 100 భాగస్వామ్యం నెలకొల్పిన అయ్యర్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌తోనూ మంచి పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేశాడు. కోహ్లీ ఔటైన తర్వాత మైదానంలో అడుగుపెట్టిన రాహుల్‌(41 బంతుల్లో) తనదైన శైలిలో హాఫ్‌సెంచరీతో విజృంభించాడు. వన్డేల్లో రాహుల్‌కిది ఏడో అర్ధశతకం కావడం విశేషం. అయ్యర్‌, రాహుల్‌ జోడీ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.  ఈ జోడీ దూకుడును అడ్డుకోవడంలో ఆతిథ్య బౌలర్లు తేలిపోయారు.  logo