బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 09:58:27

IND vs NZ: విరాట్‌ కోహ్లీ బౌల్డ్‌

IND vs NZ:  విరాట్‌ కోహ్లీ బౌల్డ్‌

యస్‌ వన్డేల్లో ఏడో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లెగ్‌స్పిన్నర్‌ ఇష్‌ సోధీ వేసిన 29వ ఓవర్లో బౌల్డ్‌ అయ్యాడు. అదే ఓవర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసి విరాట్‌ 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. తక్కువ స్కోరుకే ఓపెనర్లు వెనుదిరగడంతో ఈ జోడీ సంయమనంతో ఆడింది. కెరీర్‌లో విరాట్‌ 58వ వన్డే హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్నవిరాట్‌ను సోధీ తన తొలి ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు.  

నిలకడగా ఆడుతున్న శ్రేయస్‌ వన్డేల్లో ఏడో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అయ్యర్(51)‌, రాహుల్‌(10) భారత్‌కు భారీ స్కోరు అందించాలనే పట్టుదలతో ఉన్నారు. 33 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. కోహ్లీసేనను 270 పరుగుల లోపే కట్టడి చేయాలని ఆతిథ్య కివీస్‌ భావిస్తోంది. logo