బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 06, 2020 , 20:35:13

MI vs RR: ముంబైకి షాక్‌.. వరుసగా రెండు వికెట్లు

MI vs RR: ముంబైకి షాక్‌.. వరుసగా రెండు వికెట్లు

అబుదాబి: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. జోరుగా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌కు స్పిన్నర్‌ శ్రేయాస్‌ గోపాల్‌ ఒక్కసారి స్పీడ్‌బ్రేక్‌   వేశాడు.  పదో ఓవర్లో  వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బకొట్టాడు.  మొదటి బంతికి క్రీజులో కుదురుకున్న రోహిత్‌ శర్మ(35)ను.. రెండో బంతికి అప్పుడే బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌(0)ను ఔట్‌ చేసి రాజస్థాన్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు.

తర్వాతి రెండు ఓవర్లలో ముంబై నిదానంగా ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.  ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌(37) దూకుడుగా ఆడుతుండగా కృనాల్‌ పాండ్య(2) సహకారం అందిస్తున్నాడు.