శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 18:13:45

RR vs RCB: మళ్లీ విఫలమైన ఫించ్‌

RR vs RCB: మళ్లీ విఫలమైన ఫించ్‌

దుబాయ్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 178 పరుగుల ఛేదనలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలకడగా ఆడుతోంది.  పవర్‌ప్లే  ఆఖరికి  వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది.  స్పిన్నర్‌  శ్రేయస్‌ గోపాల్‌ వేసిన నాలుగో ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయిన ఆరోన్‌ ఫించ్‌(14) రాబిన్‌ ఉతప్పకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.   దీంతో బెంగళూరు 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. పేలవ ప్రదర్శన చేస్తున్న ఫించ్‌ ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.  ఐపీఎల్‌ 2020 సీజన్‌లో గోపాల్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔటవడం ఇది రెండోసారి.

 కార్తీక్ త్యాగీ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ రెండు ఫోర్లు బాది 12 రన్స్‌ రాబట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, పడిక్కల్‌ ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లకు బెంగళూరు  వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్‌, పడిక్కల్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు.  బెంగళూరు విజయానికి ఇంకా 66 బంతుల్లో 114 పరుగులు చేయాల్సి ఉంది.