బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 26, 2020 , 22:21:02

ఏడాదంటే కష్టం..

ఏడాదంటే కష్టం..

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటంపై స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ విచారం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) తీసుకున్న నిర్ణయం తన ఆశలపై నీళ్లు చల్లిందని ఆమె పేర్కొంది. ‘ఐవోసీ తాజా నిర్ణయంతో నిరాశ చెందా. ఒలింపిక్స్‌ వాయిదా వేస్తారేమో అని ముందు నుంచి భయపడుతూ వచ్చా. చివరకు అదే జరిగింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న విశ్వవేదికపై రాణించడం మామూలు విషయం కాదు. అలాంటిది మెగాటోర్నీ ఏడాది వాయిదా పడితే అథ్లెట్లకు అది చాలా కష్టం. గేమ్స్‌ కోసం వేచి చూడటం మళ్లీ సన్నాహకాలు కొనసాగించడం దానికన్నా పెద్ద కష్టం’ అని వినేశ్‌ పేర్కొంది.

రియో (2016)లో కచ్చితంగా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలో దిగిన వినేశ్‌ గాయం కారణంగా అర్ధాంతరంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న స్టార్‌ రెజ్లర్‌ గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో  సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. క్రితంసారి దక్కని పతకాన్ని ఈసారైన ముద్దాడాలనుకుంటే.. ఐవోసీ నిర్ణయం ఆమె ఆశలను వాయిదా వేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలని మనో ధైర్యంతో ముందుకుసాగాలని ఫొగాట్‌ పేర్కొంది.logo