మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 17, 2020 , 17:41:45

ధోనికి బౌలింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. పఠాన్‌ హెచ్చరిక

ధోనికి బౌలింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. పఠాన్‌ హెచ్చరిక

న్యూ ఢిల్లీ : యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఎడిషన్‌లో ఎంఎస్ ధోనీకి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. శనివారం ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తన 16 ఏళ్ల కెరీర్‌ను ముగించిన సంగతి తెలిసిందే. 

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ ‘ధోని ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు.. అతడికి జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలని..  ఎందుకంటే అతడు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లబోతున్నాడ’ని అన్నాడు. ‘ధోని సీఎస్‌కే కోసం ఆడడాన్ని ఆనందిస్తాడు. ఈ ఐపీఎల్‌ కోసం నేను నిజంగా ఎదురు చూస్తున్నా. కానీ బౌలర్లందరూ జాగ్రత్తగా ఉండండి.’ అని అన్నారాయన. 

‘ధోని సీఎస్‌కే పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నాడని మనమందరం గుర్తించాలి. సీఎస్‌కే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా ఉండటానికి ధోని నాయకత్వం ఒక కారణం. కాబట్టి సీఎస్‌కే ట్రోఫీని గెలుచుకోవడానికి ధోని ఏదైనా చేస్తాడని’లక్ష్మణ్‌ అన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo