బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 02, 2020 , 20:26:35

ఎంఎస్‌ ధోనీ కొత్త లుక్‌ అదుర్స్‌!

ఎంఎస్‌ ధోనీ కొత్త లుక్‌ అదుర్స్‌!

ముంబై: అతికొద్దిరోజుల్లో ఐపీల్‌ ప్రారంభమవుతున్న వేళ చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ న్యూలుక్‌తో అదరగొడుతున్నాడు. తల వెంట్రుకలు, నల్లటి గడ్డాన్ని నీట్‌గా ట్రిమ్‌ చేసుకుని మ్యాన్లీగా కనిపిస్తున్న ధోనీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులంతా హెలిక్యాప్టర్‌ షార్ట్స్‌ స్పెషలిస్ట్‌ కొత్త లుక్‌ను చూసి ఫిదా అవుతున్నారు. 

జూలై 2019 నుంచి ధోనీ  క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడలేదు. 14 నెలల తర్వాత ఐపీఎల్‌లో మెరువనున్నాడు.  ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ శిక్షణా శిబిరాలను యూఏఈలో నిర్వహించనున్నాయి. ఈ నెల రెండోవారంలో సీఎస్‌కే యూఏఈ చేరకుంటుందని జట్టు అధికారులు ధ్రువీకరించారు. అంటే రాబోయే కొద్దిరోజుల్లోనే ధోనీ మైదానంలోకి రాబోతున్నాడు. అతడి ఆట కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo