మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 05, 2020 , 01:39:00

బీజేపీలోకి షూటర్‌ శ్రేయసి సింగ్‌

బీజేపీలోకి షూటర్‌ శ్రేయసి సింగ్‌

న్యూఢిల్లీ: 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన షూటర్‌ శ్రేయసి సింగ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనరల్‌ సెక్రటరీలు భూపేందర్‌ యాదవ్‌, అరుణ్‌ సింగ్‌ సమక్షంలో బీజేపీలోకి  వచ్చిన ఆమె.. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. శ్రేయసి తండ్రి దివంగత దిగ్విజయ్‌ సింగ్‌ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు సీటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.