ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 27, 2021 , 02:28:42

కర్ణాటకకు షాక్‌

 కర్ణాటకకు షాక్‌

సెమీస్‌లో పంజాబ్‌, తమిళనాడు.. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ

అహ్మదాబాద్‌: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటకకు పంజాబ్‌ షాకిచ్చింది. మంగళవారం ఇక్కడి మొతెరాలో జరిగిన తొలి క్వార్టర్స్‌లో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో కర్ణాటకపై గెలిచింది. సిద్ధార్థ్‌ కౌల్‌ (3/15)తో పాటు పంజాబ్‌ పేసర్ల విజృంభణతో తొలుత కర్ణాటక 17.2 ఓవర్లలో 87కు ఆలౌటైంది. అనిరుధ్‌ జోషి (27) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్‌ 12.4 ఓవర్లలోనే ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. రెండో క్వార్టర్స్‌లో తమిళనాడు 5 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై గెలిచింది. తొలుత హిమాచల్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేస్తే.. 17.5 ఓవర్లలోనే తమిళ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. చేజింగ్‌లో ఓ దశలో తమిళనాడు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా తొలుత బాబా అపరాజిత్‌ (52 నాటౌట్‌) అఖర్లో షారుఖ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌) దూకుడుగా ఆడి జట్టును అలవోకగా గెలిపించారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరొందిన మొతెరాలో జరిగిన తొలి దేశవాళీ మ్యాచ్‌ ఇదే. 

VIDEOS

logo