మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:48:29

కోహ్లీ దరిదాపుల్లో ఉన్నారా?

కోహ్లీ దరిదాపుల్లో ఉన్నారా?

పాక్‌ అభిమానులకు అక్తర్‌ ప్రశ్న

న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సమతూగే ఆటగాడు మరొకరు లేరని.. అలాంటప్పుడు అతడిని ప్రశంసిస్తే తప్పేంటని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశ్నించాడు. ఇటీవల కోహ్లీ, రోహిత్‌పై అక్తర్‌ ప్రశంసలు కురిపించడాన్ని కొందరు పాకిస్థానీ నెటిజన్లు తప్పుపట్టారు. దీనిపై అతడు తాజాగా స్పందిస్తూ. ‘భారత ఆటగాళ్లను ఎందుకు ప్రశంసించకూడదు. పాకిస్థాన్‌లో కానీ, ప్రపంచ క్రికెట్‌లో కానీ కోహ్లీ దరిదాపుల్లో ఏ ఆటగాడైనా ఉన్నాడా? నన్ను విమర్శించే ముందు ఓసారి గణాంకాలు పరిశీలిస్తే మంచిది. విరాట్‌ ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అతడు ప్రశంసలకు అర్హుడు’ అని నెటిజన్లకు చురకలంటించాడు. logo