శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 15, 2020 , 03:20:40

చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి మిస్బా వీడ్కోలు

చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి మిస్బా వీడ్కోలు

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి మాజీ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ వీడ్కోలు పలికాడు. అయితే హెడ్‌కోచ్‌గా కొనసాగను న్నాడు. వచ్చే నెల ఆఖరులో సెలెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మిస్బా బుధవారం ప్రకటించాడు. గతేడాది సెప్టెంబర్‌లో చీఫ్‌ సెలెక్టర్‌తో పాటు కోచ్‌గా నియమితుడైన మిస్బాను పలువురు విమర్శించారు. జోడు పదవుల్లో అతడిని నియమించడమేంటంటూ  పీసీబీ వైఖరిని కూడా తప్పుబట్టారు. దీంతో పాటు ఏడాది కాలంగా కాలంగా పాక్‌ జట్టు సరైన ప్రదర్శన చేయలేకపోతున్న నేపథ్యంలో మిస్బా ఈ నిర్ణయానికి వచ్చాడు.