ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 27, 2020 , 21:42:18

నా కుటుంబంలోకి కొత్త సభ్యులొచ్చారు: ధవన్

నా కుటుంబంలోకి కొత్త సభ్యులొచ్చారు: ధవన్

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్​.. రెండు శునకాలను దత్తత తీసుకున్నాడు. వాటికి చోలే, వాలెంటైన్ అని పేర్లు పెట్టాడు. ఈ శునకాల ఫొటోలను శనివారం ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. “ఈ రోజు రెండు అందమైన వాటిని దత్తత తీసుకున్నా. చోలే, వాలైంటైన్ మా కొత్త కుటుంబ సభ్యులు” అని ధవన్ పేర్కొన్నాడు. ధవన్ పోస్ట్​కు న్యూజిలాండ్​ పేసర్ మెక్​క్లెనిగన్ స్పందించాడు. నైస్ అని కామెంట్ చేశాడు. లాక్​డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ధవన్.. ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా గాయం కారణంగా ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు ధవన్ దూరమైన సంగతి తెలిసిందే.  


logo