ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 21:31:14

KXIP vs DC: శతక్కొట్టిన శిఖర్‌ ధావన్‌

KXIP vs DC: శతక్కొట్టిన శిఖర్‌ ధావన్‌

దుబాయ్:‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.  సూపర్‌ ఫామ్‌లో ఉన్న  శిఖర్‌ ధావన్‌ ‌(106నాటౌట్‌: 61 బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు)  మరో అద్భుత ప్రదర్శన చేశాడు.  వరుసగా  నాలుగో  మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌  పవర్‌ ఏమిటో చూపించాడు. పరుగులకు   కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై బౌండరీలతో హోరెత్తిస్తూ వరుసగా రెండో శతకం బాదేశాడు. 

 ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో ఉన్న ధావన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌(14), రిషబ్‌ పంత్‌(14) కాస్త సహకారం అందించారు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ పెద్దగా అండగా నిలబడకపోయినా పంజాబ్‌ బౌలర్లను ధాటిగాఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ధావన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.  ఒంటిచేత్తో జట్టు స్కోరును 160 దాటించాడు.  పంజాబ్‌ బౌలర్లలో  మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా.. మాక్స్‌వెల్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.