ఆదివారం 24 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 13:33:18

ఇలా ప్రాక్టీస్ చేసి ఏం లాభం.. ర‌హానేను ట్రోల్ చేసిన ధావ‌న్‌

ఇలా ప్రాక్టీస్ చేసి ఏం లాభం.. ర‌హానేను ట్రోల్ చేసిన ధావ‌న్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు టీమిండియా సిద్ధ‌మ‌వుతోంది. యూఏఈ నుంచి నేరుగా ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన కోహ్లి సేన‌.. క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ చేస్తోంది. అక్క‌డి క్వారంటైన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉండ‌టంతో టీమిండియా ప్లేయ‌ర్స్‌కు బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం రావ‌డం లేదు. దీంతో ర‌క‌ర‌కాల ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. అలాంటిదే ఓ వీడియోను టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌ అజింక్య ర‌హానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ ఇవాళ లేదు. అయినా నేను బ్యాటింగ్ చేస్తూనే ఉండ‌టానికి కొత్త దారులు వెతుక్కుంటాను. నా బ్యాట్‌కు నేను ఎక్కువ స‌మ‌యం దూరంగా ఉండ‌లేను అని ర‌హానే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. అయితే ఈ వీడియోను ట్రోల్ చేస్తూ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఓ ఫ‌న్నీ మెసేజ్ పోస్ట్ చేశాడు. ఒక రోజు ముందు నువ్వు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగ‌తి తెలుసు. అందులో హాఫ్ సెంచ‌రీ కొట్టావ‌నీ తెలుసు. ఇలాంటి ప్రాక్టీస్‌తో ఏం లాభం. రూమ్‌లో నీ కూతురుతో ఆడుకో అని ధావ‌న్ అన్నాడు. శుక్ర‌వారం జ‌రిగే తొలి వ‌న్డేతో ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్ మొద‌లు కానుంది. తొలి టెస్ట్ అడిలైడ్‌లో డిసెంబ‌ర్ 17న ప్రారంభం కానుంది. ఇది డేనైట్ టెస్ట్ కావ‌డం విశేషం. 


logo