శనివారం 08 ఆగస్టు 2020
Sports - Jul 14, 2020 , 13:27:15

కొడుకుతో కలిసి చిందులేసిన శిఖర్‌ ధావన్‌

కొడుకుతో కలిసి చిందులేసిన శిఖర్‌ ధావన్‌

ముంబై : కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు నిలిచిపోయిన సంతగి తెలిసిందే. అయితే ఈ సమయాన్ని క్రికెటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే.. మరి కొందరు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తాజాగా అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఓ పంజాబీ పాటకు తన కొడుతో కలిసి చిందులేశాడు ధావన్‌.

భార్య అయేషాను కూడా తమతో ఆడమని పిలిచాడు. ఈ విషయంపై టీమిండియా కుర్రాడు యుజువేంద్ర చాహల్‌ స్పందిచాడు. ‘భయ్యా  వదిన డ్యాన్స్‌ చేయడం మొదలు పెడితే గబ్బర్‌ జోడీ ఎవరూ ఉండరు మరి’ అంటు చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తున్న సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo