బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 21:13:27

ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు

ఐపీఎల్‌ చరిత్రలో  తొలిసారి.. శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు

దుబాయ్:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో    ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(101 నాటౌట్‌, 106 నాటౌట్‌) అరుదైన రికార్డు నెలకొల్పాడు.  ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి వరుసగా రెండు అద్భుత సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో వరుసగా రెండు శతకాలు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌ ధావనే కావడం విశేషం. 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో 57 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ధావన్‌(101 నాటౌట్‌: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీ బాదాడు.  ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలుస్తున్న  ధావన్‌.. ప్రత్యర్థి బౌలర్లపై  యధేచ్ఛగా విరుచుకుపడి జట్టును ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు.