గురువారం 13 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 13:28:17

గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌..ప్రాక్టీస్‌ వీడియో వైరల్‌

గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌..ప్రాక్టీస్‌ వీడియో వైరల్‌

న్యూఢిల్లీ:  టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. కరోనా లాక్‌డౌన్‌తో   మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన ధావన్‌    మళ్లీ  బ్యాట్‌పట్టి   సాధన ప్రారంభించాడు.  ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న  వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 'ఈ తీవ్రతను ఇలానే కొనసాగించాలి. బ్యాట్‌ను బంతి తాకినప్పుడు వచ్చే సౌండ్‌ను చాలా ఇష్టపడతానని'వ్యాఖ్యానించాడు.

ధనాధన్‌ బ్యాటింగ్‌తో మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడాడు.  ఐపీఎల్‌లో ధావన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్నాడు.  యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్‌-13 సీజన్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తు్ండటంతో ఆటగాళ్లంతా సాధన మొదలెట్టారు. 

తాజావార్తలు


logo