మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 22:25:19

గబ్బర్‌ అర్ధసెంచరీ..విజయం దిశగా ఢిల్లీ

గబ్బర్‌ అర్ధసెంచరీ..విజయం దిశగా ఢిల్లీ

అబుదాబి: ఐపీఎల్‌-13లో  భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనలో  ఢిల్లీ క్యాపిటల్స్‌   విజయం దిశగా దూసుకెళ్తోంది.  ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(54) అర్ధశతకం సాధించాడు.  స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ పృథ్వీ షా పెవిలియన్‌ చేరడంతో ధావన్‌, రహానె ఇన్నింగ్స్‌  చక్కదిద్దారు.  షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 13వ ఓవర్లో ధావన్‌ ఔటయ్యాడు.  

సాధారణ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఎలాంటి తడబాటు లేకుండానే జోరుగా బ్యాటింగ్‌ చేస్తోంది. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ఒత్తిడి లేకుండా ఆడుతోంది.  13 ఓవర్లకు ఢిల్లీ 2 వికెట్లకు 109 పరుగులు చేసింది. రహానె(42), శ్రేయస్‌ అయ్యర్‌(1) క్రీజులో ఉన్నారు.