శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 19, 2020 , 21:24:47

పృథ్వీ షాతో ధవన్‌ డ్యాన్స్‌ : వీడియో

పృథ్వీ షాతో ధవన్‌ డ్యాన్స్‌ : వీడియో

సిడ్నీ : టీమ్‌ఇండియా యువ స్టార్‌ పృథ్వీ షాతో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చిందేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టుతో సమరానికి సన్నద్ధమవుతున్న తరుణంలో సరదాగా ఓ పాత బాలీవుడ్‌ పాటకు ఇద్దరూ డ్యాన్స్‌ చేశారు. ప్రాక్టీస్‌ మధ్యలో చేసిన ఈ సరదా వీడియోను శిఖర్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. లైలా నన్నింకా పిచ్చివాడిని చేస్తున్నది అని క్యాప్షన్‌ జతచేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్లు ప్రస్తుతం సిడ్నీలో క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇటీవల తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసిన ధవన్‌ ప్రాక్టీస్‌ జోరుగా సాగుతున్నదని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ధవన్‌, షా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే.  డిల్లీ తరఫున రెండు శతకాలతో విజృంభించిన శిఖర్‌... ఆసీస్‌తో సిరీస్‌ల్లోనూ మెరిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. ఈ నెల 27 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి.