శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 16, 2020 , 18:04:11

ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ధావన్‌ రికార్డు

ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ధావన్‌ రికార్డు

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ నిలిచాడు.  ఐపీఎల్‌లో ధావన్‌ ఇప్పటి వరకు 39సార్లు 50+ స్కోరు సాధించాడు.  బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో గబ్బర్‌ 57 పరుగులు సాధించడం ద్వారా ఈ ఫీట్‌ అందుకున్నాడు. 

ఈ క్రమంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ,  చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా,   ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మలను ధావన్‌ అధిగమించాడు. ఇప్పటి వరకు వీరంతా 38 అర్ధశతకాలు నమోదు చేశారు. 

ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌,  ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అత్యధిక అర్ధశతకాలతో జాబితాలో  ధావన్‌ కన్నా ముందుకున్నాడు. వార్నర్‌ పేరిట 46 హాఫ్‌సెంచరీలున్నాయి.  సౌతాఫ్రికా హార్డ్‌హిట్టర్‌, బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ 36 అర్థసెంచరీలు నమోదు చేశాడు.