శనివారం 04 జూలై 2020
Sports - May 08, 2020 , 19:26:50

ధ‌వ‌న్ తొలి బంతిని ఎదుర్కోలేడు: రోహిత్‌

ధ‌వ‌న్ తొలి బంతిని ఎదుర్కోలేడు:  రోహిత్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా ఓపెన‌ర్ శిఖర్ ధ‌వ‌న్.. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కునేందుకు జంకుతాడ‌ని హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. శుక్ర‌వారం ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో రోహిత్‌శ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా `నీ తోటి ఓపెన‌ర్ ధ‌వ‌న్ గురించి ఏదైనా చెప్పు` అని వార్న‌ర్‌.. రోహిత్‌ను ప్ర‌శ్నించాడు. 

దీనికి స‌ర‌దాగా బ‌దులిచ్చిన హిట్‌మ్యాన్‌.. `ధ‌వ‌న్ ఒక ఇడియ‌ట్‌.. పేస‌ర్ల బౌలింగ్‌లో తొలి బాల్ ఎదుర్కునేందుకు సాహ‌సించ‌డు. స్పిన్న‌ర్లైతే ఓకే కానీ పేస్ అంటేనే న‌న్ను ముందుకు తోస్తుంటాడు. 2013లో తొలిసారి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఓపెన‌ర్ అవ‌తార‌మెత్తిన‌ప్పుడు స్ట్రయిక్ తీసుకోమ‌ని శిఖ‌ర్‌ను అడిగా.. అందుకు అత‌డు నిరాక‌రించాడు. నేను మొద‌టి సారి కొత్త బంతిని ఎదుర్కోబోతున్నా అని చెప్పిన విన‌లేదు. మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో తొలి మూడు బంతుల‌ను నేను చూడ‌లేక‌పోయా.. ఆ పిచ్‌పై అంత బౌన్స్ ఉంటుంద‌ని నేను ఊహించ‌లేక‌పోయా. ఇప్పుడు మాత్రం మేమిద్ద‌రం మంచి స్నేహితులం` అని అన్నాడు. 


logo