శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 02:32:08

ఎలవెనిల్‌కు స్వర్ణం

 ఎలవెనిల్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ: షేక్‌ రసెల్‌ అంతర్జాతీయ ఎయిర్‌ రైఫిల్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ స్వర్ణ పతకం సాధించింది. బంగ్లాదేశ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (బీఎస్‌ఎస్‌ఎఫ్‌) వర్చువల్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో ఆరుదేశాల షూటర్లు పాల్గొన్నారు. 60 షాట్ల పోటీలో ప్రపంచ నంబర్‌వన్‌ ఎలావెనిల్‌ 627.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. షిహోరి హిరట (622.6), ఇండేనేషియా షూటర్‌ విద్యా తొయిబిటా (621.1) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల విభాగంలో భారత షూటర్‌ సాహూ తుషార్‌ మనే 623.8తో రజత పతకం సాధించగా.. జపాన్‌ షూటర్‌ నవోనా ఒకాడ (630.9) స్వర్ణ పతకంతో మెరిశాడు.