సోమవారం 13 జూలై 2020
Sports - Apr 03, 2020 , 16:19:27

బుమ్రాను అనుకరించిన రోహిత్ కూతురు: వీడియో

బుమ్రాను అనుకరించిన రోహిత్ కూతురు: వీడియో

భారత స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడి బౌలింగ్ యాక్షన్​, పేస్​, యార్కర్లకు ఫిదా అయ్యారు. కాగా,  టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూతురు 15నెలల సమైరా కూడా బుమ్రాకు ఫ్యాన్​గా మారినట్టుంది. గురువారం ఇన్​స్టాగ్రామ్​లో బుమ్రా చేసిన పోస్ట్​ను చూస్తే ఇది అర్థమవుతున్నది. ఆ వీడియోలో రోహిత్.. సమైరాతో ఆడుకుంటన్నాడు. అప్పుడు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడు అని రోహిత్ భార్య రితిక.. సమైరాను అడిగింది. దీంతో బుమ్రా బౌలింగ్ యాక్షన్​ను సమైరా అనురించడంతో రోహిత్ నవ్వాడు. ఈ వీడియోతో పాటు “నాకంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు ఫ్యాన్ అయిపోయా” అని బుమ్రా ఇన్​స్టాలో పోస్ట్ చేసి, రోహిత్​, రితికను ట్యాగ్ చేశాడు. కాగా, సమైరా మంచి బౌలర్​ను ఎంచుకుందని బుమ్రాతో రోహిత్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆట నిలిచిపోవడంతో టీమ్​ఇండియా ప్లేయర్లందరూ ఇండ్లకే పరిమితమై కుటుంబాలతో గడుపుతున్నారు.  


logo