మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 21:14:21

తొలి అడుగు అత‌డిదే

తొలి అడుగు అత‌డిదే

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో విశ్వ‌వ్యాప్తంగా స్తంభించిపోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్ల కోసం ఏడు మైదానాల్లో ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేయ‌గా.. క్రిస్ వోక్స్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్ తొలిరోజు మైదానంలో దిగి చెమ‌టోడ్చారు. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. శార్దూల్ ఠాకూర్ తొలిసారి గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. పాల్‌ఘ‌ర్ ద‌హాను తాలూకా స్పోర్ట్స్ అసోసియేష‌న్ (పీడీటీఎస్ఏ) స్టేడియంలో శార్దూల్ శ‌నివారం ప్రాక్టీస్ చేశాడు. 

భార‌త్ త‌ర‌ఫున 11 వ‌న్డేలు, 15 టీ20లు ఆడిన శార్దూల్‌.. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్‌తోనూ ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. `రెండు నెల‌ల త‌ర్వాత తిరిగి మైదానంలో దిగ‌డం కొత్త‌గా ఉన్నా. ఇదో చ‌క్క‌టి అనుభ‌వం. చాన్నాళ్ల త‌ర్వాత ప్రాక్టీస్ చేయ‌డం సంతోషంగా ఉంది` అని శార్దూల్ అన్నాడు. లాక్‌డౌన్ అనంత‌రం క్రీకెట్ తిరిగి ప్రారంభించేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) శుక్ర‌వారం మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేసింది.


logo