శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 16:52:56

న‌న్ను న‌మ్మిన ధోనీకి కృతజ్ఞతలు: వాట్సన్‌

న‌న్ను న‌మ్మిన ధోనీకి కృతజ్ఞతలు: వాట్సన్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-13వ సీజన్‌లో    చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌  పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.     ఒకటి, రెండు మ్యాచ్‌లు మినహా వాట్సన్‌ పెద్దగా రాణించలేకపోయాడు.  13 ఏళ్ల   ఐపీఎల్‌ కెరీర్‌కు వాట్సన్‌ రెండు రోజుల క్రితం ముగింపు పలికాడు. గత   ఆదివారం చెన్న   ఆఖరి మ్యాచ్‌ను ఆడేసిన తర్వాత.. అన్ని రకాల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్టు    జట్టు సహచరులకు, ఫ్రాంచైజీకి  చెప్పాడు.

చెన్నై జట్టుతో మూడేళ్ల అనుబంధంపై వాట్సన్‌  స్పందించాడు.  జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తనపై నమ్మకం ఉంచారని పేర్కొన్నాడు.  ప్రజెంటర్‌ రుపా రమణితో జరిగిన సంభాషణలో వాట్సన్‌ మాట్లాడుతూ.. 2019 సీజన్‌లో విఫలమైనప్పటికీ తనను తుది జట్టు  నుంచి తప్పించలేదని తెలిపాడు. 

కెప్టెన్‌-కోచ్‌ ద్వయం తనపై అపార నమ్మకం ఉంచినందుకు వారిపై   ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌  ప్రశంసలు కురిపించాడు.  గతేడాది సీజన్‌లో ఆశించిన మేర రాణించకపోయినప్పటికీ తనపై విశ్వాసం ఉంచినందుకు ధోనీ, ఫ్లెమింగ్‌కు  ధన్యవాదాలు తెలిపాడు.