బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 17:32:10

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్‌బై!

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్‌బై!

దుబాయ్:‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌(39) ఫ్రాంఛైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై గెలిచిన అనంతరం వాట్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సహచర ఆటగాళ్లతో మాట్లాడుతూ..అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతానని చెప్పాడు. 

'చివరి మ్యాచ్‌ తర్వాత  డ్రెస్సింగ్‌ రూమ్‌లో  క్రికెట్‌కు‌ వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని చెబుతూనే  భావోద్వేగానికి లోనయ్యాడు. ఫ్రాంఛైజీ తరఫున ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని' వాట్సన్‌ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  ఆసీస్‌ సీనియర్‌ ఓపెనర్‌ వాట్సన్‌ కొన్నేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 

2018 ఐపీఎల్‌ వేలంలో వాట్సన్‌ను చెన్నై కొనుగోలు చేసింది.  2018 ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో శతకం సాధించడంతో చెన్నై మూడోసారి ట్రోఫీ గెలిచింది.    ఆస్ట్రేలియా   దిగ్గజాలతో కలిసి ఆడిన వాట్సన్‌ 2007, 2015 వరల్డ్‌కప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టులో  సభ్యుడిగా ఉన్నాడు.