ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 23:04:44

KKR vs CSK: వాట్సన్‌ ఔట్‌.. ఆశలన్నీ ధోనీపైనే

KKR vs CSK: వాట్సన్‌ ఔట్‌.. ఆశలన్నీ ధోనీపైనే

అబుదాబి:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ అర్ధశతకం సాధించాడు. కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వాట్సన్‌ 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికిది 21వ అర్ధశతకం కావడం విశేషం. సునీల్‌  నరైన్‌ వేసిన 14వ  ఓవర్లో  వాట్సన్‌(50) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు.    చెన్నై విజయానికి ఇంకా 30 బంతుల్లో 58 రన్స్‌ చేయాల్సి ఉంది.  ప్రస్తుతం మహేంద్ర సింగ్‌ ధోనీ(6), శామ్‌ కరన్‌(4) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు చెన్నై 3 వికెట్ల నష్టానికి 110  పరుగులు చేసింది.