సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 22:31:06

KKR vs CSK: చెన్నై.. అదే జోరు

KKR vs CSK: చెన్నై.. అదే జోరు

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తోంది. నాలుగో ఓవర్లోనే  ప్రమాదకర ఓపెనర్‌ డుప్లెసిస్‌(17) వికెట్‌ కోల్పోయినా జోరు మాత్రం తగ్గించట్లేదు. ఫామ్‌లో ఉన్న వాట్సన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. వాట్సన్‌ బౌండరీలతో చెలరేగడంతో పవర్‌ప్లేలో చెన్నై 54 రన్స్‌ రాబట్టింది. 

వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు సైతం వేగంగా ఆడుతుండటంతో చెన్నై వేగంగా లక్ష్యం దిశగా సాగుతోంది.  ఆరంభంలోనే మెరుపులు మెరిపించడంతో  సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటం, చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండటంతో ధోనీసేన గెలుపు దాదాపు ఖాయమైంది. 9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. వాట్సన్‌(37), రాయుడు(22) క్రీజులో ఉన్నారు.