మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 16:40:47

షేన్ వార్న్ కోచ్ లాంటివాడు

 షేన్ వార్న్ కోచ్ లాంటివాడు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్‌వార్న్ త‌న‌కు వ్య‌క్తిగ‌త కోచ్‌క‌న్నా ఎక్కువ అని టీమ్ఇండియా స్పిన్న‌ర్ కు్ల్దీప్ యాద‌వ్ పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లే భార‌త కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో తొలిసారి వార్న్‌తో మాట్లాడాన‌ని తొలి ప‌రిచ‌యంలోనే వార్న్ త‌న‌తో చాలా బాగా మాట్లాడాడాని గుర్తు చేసుకున్నాడు.  సెప్టంబ‌ర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ కోసం సిద్ధ‌మ‌వుతున్న కుల్దీప్ గురువారం ఓ టీవీ షోలో మాట్లాడుతూ..

`అనిల్ భాయ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో 2017 పుణే టెస్టు ముందు తొలిసారి షేన్ వార్న్‌ను క‌లుసుకున్నా. ఆ స‌మ‌యంలో కుంబ్లే.. వార్న‌ర్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఆ త‌ర్వాత నా వంతు వ‌చ్చింది. దీంతో నా మ‌న‌సులోని భావాల‌ను అత‌డితో పంచుకున్నా. చాలా సేపు మాట్లాడాక నీ ద‌గ్గ‌ర చాలా ఆలోచ‌న‌లు ఉన్నాయి అని వార్న‌ర్ నాతో అన్నాడు. ఆ త‌ర్వాత చాలా సార్లు వార్న్‌తో మాట్లాడా. అత‌డు నాకు కోచ్ లాంటివాడు. అతడి సూచ‌న‌లు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ్డాయి`అని చెప్పాడు. 


logo