గురువారం 04 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 17:36:46

దాదాకే ప‌గ్గాలిచ్చిన షేన్ వార్న్‌

దాదాకే ప‌గ్గాలిచ్చిన షేన్ వార్న్‌

దాదాకే ప‌గ్గాలిచ్చిన షేన్ వార్న్‌


న్యూఢిల్లీ:  భార‌త ఆల్‌టైమ్ అత్యుత్త‌మ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీనే అని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్ వార్న్ పేర్కొన్నాడు. తాను ఎదుర్కొన్న భార‌త‌ ఆట‌గాళ్ల నుంచి అత‌డు ఆల్‌టైమ్ ఎలెవ‌న్ జ‌ట్టును ఎంపిక చేశాడు. అందులో దాదాతో పాటు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్ర‌విడ్‌, మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్‌దేవ్‌ల‌కు చోటు క‌ల్పించాడు. సెహ్వాగ్‌, సిద్ధుల‌ను ఓపెన‌ర్‌లుగా ఎంపిక చేశాన‌ని తెలిపాడు. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీల‌ను ఈ జ‌ట్టులోకి ఎంపిక చేయ‌లేదు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన అత‌డు.. ఫార్మాట్‌ల‌కు అతీతంగా విరాట్ కోహ్లీ అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్ అయిన‌ప్ప‌టికీ ఒక‌ప్ప‌టి భార‌త ఆట‌గాళ్ల‌కే ఇందులో అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలిపాడు.


బౌలింగ్ విష‌యానికొస్తే.. క‌పిల్‌దేవ్‌తో పాటు మ‌రో పేస‌ర్‌గా శ్రీ‌నాథ్‌కు చాన్సిచ్చిన వార్న్‌.. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ల‌కు అవ‌కాశ‌మిచ్చాడు. ఇక వికెట్‌కీప‌ర్ స్థానంలో న‌య‌న్ మోంగియాను ఎంపిక చేశాడు. ఆస్ట్రేలియా అంటేనే విరుచుకుపడే హైద‌రాబాదీ బ్యాట్స్‌మ‌న్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌కు ఈ జ‌ట్టులో చోటు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై స్పందించిన స్పిన్ లెజండ్ నాయ‌కుడిగా గంగూలీని ఎంపిక చేసేందుకే వెరీ వెరీ స్పెష‌ల్ ల‌క్ష్మ‌ణ్‌ను విస్మ‌రించిన‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా బుధ‌వారం వెల్ల‌డించాడు.


షేన్ వార్న్ ఎంపిక చేసిన భార‌త అత్యుత్త‌మ క్రికెట్ జ‌ట్టు:

సౌర‌వ్ గంగూలీ (కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్ర‌విడ్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, క‌పిల్ దేవ్‌, న‌య‌న్ మోంగియా (వికెట్ కీప‌ర్‌), హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, శ్రీ‌నాథ్‌, అనిల్ కుంబ్లే.logo