శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 20:05:51

షమీ జోరు..ఢిల్లీ టాపార్డర్‌ ఢమాల్‌

షమీ జోరు..ఢిల్లీ టాపార్డర్‌ ఢమాల్‌

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు చేజార్చుకున్నది.  ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే  పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రనౌటయ్యాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో మరో ఎండ్‌లో ఉన్న పృథ్వీ షా పరుగు కోసం నిరాకరించడంతో ధావన్‌ డకౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. షమీ వేసిన నాలుగో ఓవర్లో ఢిల్లీ రెండు వికెట్లు చేజార్చుకున్నది.

తెలివిగా బంతులేస్తున్న షమీ..యువ ఆటగాడు పృథ్వీ షాతో పాటు హార్డ్‌హిట్టర్‌ హెట్‌మైయర్‌ను పెవిలియన్‌ పంపి ఢిల్లీని దెబ్బకొట్టాడు. పవర్‌ప్లే ముగిసేలోపే ఢిల్లీ 13 పరుగులకే మూడు టాప్‌ఆర్డర్‌ వికెట్లు కోల్పోయింది. మూడు వికెట్లు పడగొట్టడంలో సీనియర్‌ పేసర్‌ షమీ  తన మార్క్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.  కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. అయ్యర్‌(4), రిషబ్‌ పంత్‌(5) క్రీజులో ఉన్నారు.