శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 03, 2020 , 11:44:10

కరోనా నుంచి కోలుకున్న అఫ్రిది

కరోనా నుంచి కోలుకున్న  అఫ్రిది

ఇస్లామాబాద్‌:  కరోనా మహమ్మారి బారినపడిన పాకిస్థాన్‌ మాజీ  కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కోలుకున్నట్లు సోషల్‌మీడియా ద్వారా  ప్రకటించాడు. తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలకు తాజాగా నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ  అయినందని తెలిపాడు.  తనకు కరోనా సోకిందని   గత నెల 13న అఫ్రిది ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే.  

'నేను, నా భార్య,  ఇద్దరు కూతుళ్లు కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగున్నది.  మేమంతా క్షేమంగా  ఉండాలని  ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు.  కుటుంబసభ్యులతో  సంతోషంగా గడిపే సమయం  వచ్చిందని' అఫ్రిది ట్వీట్‌ చేశాడు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo