ఆదివారం 23 ఫిబ్రవరి 2020
షాహిద్ ఆఫ్రిదికి ఐదో సంతానం కూడా కుమార్తెనే..

షాహిద్ ఆఫ్రిదికి ఐదో సంతానం కూడా కుమార్తెనే..

Feb 15, 2020 , 13:39:16
PRINT
షాహిద్ ఆఫ్రిదికి ఐదో సంతానం కూడా కుమార్తెనే..

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్ ఆఫ్రిదికి(45) ఐదో సంతానంలో కూడా కుమార్తెనే పుట్టింది. నదియా ఆఫ్రిదిని పెళ్లాడిన షాహిద్‌కు ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇక తన ఐదో సంతానం కూడా కుమార్తెనే అని చెబుతూ తన సంతోషాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆఫ్రిది పంచుకున్నాడు. దేవుడి దయతో ఐదో బిడ్డ జన్మించింది. ఇప్పటికే నలుగురు అద్భుతమైన కూతుర్లు ఉన్నారని ఆఫ్రిది పేర్కొన్నారు.  అభిమానులతో ఈ సంతోషకరమైన విషయాన్ని పంచుకుంటున్నానని తెలుపుతూ.. ట్విట్టర్‌లో తన కుమార్తెలతో ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు షాహిద్ ఆఫ్రిది. 


logo