బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 00:47:16

మానవత్వమే.. నా అభిమతం

మానవత్వమే.. నా అభిమతం

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌పై పోరాటం కోసం పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిదీ ఛారిటీకి విరాళమివ్వాలని పిలుపునివ్వడంతో టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని చెప్పాలి కానీ, పాక్‌ కోసం అడగడమేంటని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది యువీపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో  బుధవారం ట్విట్టర్‌ వేదికగా యువరాజ్‌ స్పందించాడు. ‘బాధితులకు సాయం చేయాలన్న నా సందేశం ఇంతటి తీవ్రమైన ప్రతిస్పందనలకు ఎలా కారణమైందో నాకు అర్థం కావడం లేదు. మన పొరుగు దేశాల్లోని ప్రజలకు కూడా వైద్యసాయం అందాలనే ఆలోచనతోనే నేను అలా చెప్పా. ఎవరినీ బాధించాలనేది నా ఉద్దేశం కాదు. నేను భారతీయుడిని. ఎప్పుడూ మానవత్వం కోసమే నిలబడతా. జై హింద్‌' అని యువీ పేర్కొన్నాడు.  కాగా, సౌరవ్‌ గంగూలీలా ధోనీ, కోహ్లీ తనకు మద్దతివ్వలేదని యువీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 


logo