సోమవారం 23 నవంబర్ 2020
Sports - Nov 11, 2020 , 19:06:15

మాలిక్‌, ఆమీర్‌లకు నో ఛాన్స్‌

మాలిక్‌, ఆమీర్‌లకు నో ఛాన్స్‌

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్‌ ఆజామ్‌ను   నియమించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) తాజాగా  న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం భారీ జట్టును ప్రకటించింది.  రాబోయే కివీస్‌ టూర్‌ కోసం 35 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది.  ఇందులో  నుంచి జాతీయ పురుషుల జట్టు, షాషీన్స్‌(పాకిస్థాన్‌  ఏ టీమ్‌) జట్లను ఎంపిక చేస్తారు.   20 మంది సహాయ బృందంతో పాటు ఆటగాళ్లు నవంబర్‌ 23న లింకన్‌ బయలుదేరనున్నారు. అక్కడే 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తిచేయనున్నారు.   

ఈ పర్యటనలో పాకిస్థాన్‌ మూడు టీ20లు, రెండు టెస్టులను ఆడనుంది.  కీలక ఆటగాళ్లు షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ ఆమీర్‌లను పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అసద్‌ షఫీక్‌ను టెస్టు సిరీస్‌ నుంచి తప్పించారు.