శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 15:17:41

ఆమె ఒక బ్రాండ్‌..పెప్సీ అంబాసిడర్‌గా షఫాలీ

ఆమె ఒక బ్రాండ్‌..పెప్సీ అంబాసిడర్‌గా షఫాలీ

ముంబై:  షఫాలీ వర్మ.. కొన్ని నెలల కిందట ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది.  ఏమా బ్యాటింగ్‌, ఏమా షాట్లు.. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తరహాలో చెలరేగి ఆడుతోన్న 16ఏండ్ల షఫాలీ వర్మ(4 మ్యాచ్‌ల్లో 161 పరుగులు) ఆటకు భారత అభిమానులు పరవశించిపోయారు. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ తరహాలో ప్రత్యర్థి బౌలర్లకు ఆమె చుక్కలు చూపిస్తోంది. ఐసీసీ విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2020లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన   షఫాలీ  అతి పిన్న వయసులోనే మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో షఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 

అభిమానుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న వర్మను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు పలు కంపెనీలు పోటీపడుతున్నాయి. భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన షఫాలీని రాయబారిగా నియమించుకుని తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్‌కు ముందు ప్రముఖ  శీతల పానీయాల సంస్థ పెప్సీ షఫాలీని  తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది.  వర్మ పాపులారిటీ అమాంతం పెరిగిపోవడంతో కోట్లు కుమ్మరించడానికైనా  పలు కంపెనీలు సిద్ధమైపోయాయి. ఐకానిక్‌ బ్రాండ్‌ పెప్సీతో  ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని షఫాలీ పేర్కొంది. 


logo