ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 21, 2020 , 13:32:10

వుమెన్స్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌

వుమెన్స్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్‌..  ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌

హైద‌రాబాద్:  టీ20 మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న‌ది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  సిడ్నీలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో.. వ‌ర్మ‌, మంధానాలు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు.  రైట్ హ్యాండ్ బ్యాట్స్‌వుమెన్ ష‌ఫాలీ వ‌ర్మ‌.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది.  ఆసీస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తున్న‌ది.  ఇన్నింగ్స్ నాలుగ‌వ ఓవ‌ర్‌లో ఆమె నాలుగు ఫోర్లు కొట్టింది. భార‌త్ 5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 42 ర‌న్స్ చేసింది. మంధానా 10 ర‌న్స్ చేసి ఔటైంది. 

 


logo